20 March, 2026 | 9:07 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

‘బడ్డీ’కి రాజమౌళి ‘ఈగ’ రెఫరెన్స్

04-08-2024 12:44 AM

 దర్శకుడు శామ్ ఆంటోన్

అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బడ్డీ’. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఇటీవల థియేటర్ల ద్వారా విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శామ్ ఆంటోన్ బడ్డీ టీమ్‌తో వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ను, ప్రేక్షకాదరణ తీరును మీడియాతో షేర్ చేసుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాట ల్లోనే.. “బడ్డీ’ మూవీకి అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా చాలా బాగుందని పిల్లలు, పెద్దలు చెప్తున్నారు. కామెడీ, యాక్షన్‌తోపాటు టెడ్డీ బేర్ క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా వినోదం పంచుతోంది. తమిళ్ మూవీ ‘టెడ్డీ’లోని ఒక లైన్ మాత్రమే తీసుకొని పూర్తి కొత్త కథతో ఈ మూవీ తీశాం. అయితే, ‘బడ్డీ’ కోసం రాజమౌళి ‘ఈగ’ రెఫరెన్స్ తీసుకున్నా. యంగ్ హీరో అయితే బాగుంటుందని అల్లు శిరీష్‌ను సంప్రదిస్తే ఆయన కథ విని ఓకే చేశారు. హిప్‌హాప్ ఆది హీరోగా తర్వాతి సినిమా చేయబోతున్నా. నాకు తెలుగు సినిమాలు ఇష్టం. పూర్తి తెలుగు చిత్రం తీయాలనే ప్రయత్నాల్లో ఉన్నా. దర్శకుడిగా ఒకే జానర్‌కు పరిమితమై ఉండలేను. ఏ జానర్ అయినా చేస్తా” అన్నారు.