8 May, 2026 | 12:39 PM

సిద్దిపేటలో విచ్చలవిడిగా నిర్మాణాలు

17-09-2025 12:08 AM
  1. ప్రమాదకర పరిస్థితులు.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు

ముస్తాబాద్ రోడ్డులోని హై టెన్షన్ విద్యుత్ తీగల కింద ప్రమాదకర నిర్మాణాలు

సిద్దిపేట, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): సిద్దిపేట పట్టణంలో బహుళ అంతస్తుల నిర్మాణాలు నియంత్రణ లేకుండా సాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా జరుగు తున్న ఈ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం ప్రజల్లో ఆం దోళనకు గురిచేస్తోంది. ఒక పక్క కాగితాలపై నిబంధనలు కఠినంగా రాసి ఉంచినా, వాస్తవానికి అధికారుల ‘చేతివాటం’ వల్ల అనుమ తులు కేవలం రూపకల్పనే అవుతున్నాయి.

అనుమతులు పొందాలంటే చట్టబద్ధంగా  అ న్ని డాక్యుమెంట్లు సమర్పించినా, వారాల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వ స్తోంది. కానీ మున్సిపల్ ఉద్యోగుల చేతులు నింపితే ఒక్క రోజులోనే అనుమతులు లభిస్తున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చే స్తున్నారు. ఇది నిర్మాణ నిబంధనల ఉల్లంఘనకు ప్రోత్సాహం ఇస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

హైటెన్షన్ వైర్ల కిందే బహుళ అంతస్తులు!

అత్యంత ప్రమాదకరంగా హై టెన్షన్ వి ద్యుత్ తీగల కింద భవనాలు నిర్మాణం అవుతున్నా, అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ముస్తాబాద్ రోడ్డులో, ఎల్లారెడ్డి నగర్లో హై టెన్షన్ విద్యుత్ తీగలకు చేతి కందెంత దూరంలోనే బహుళ అంతస్తుల నిర్మాణం జరుగుతుండటం స్థానికు లను భ యాందోళనలకు గురిచేస్తోంది.

ఒకవేళ చిన్న తప్పిదం జరిగితే పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ప్రజలు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ సమస్యను పూర్తిగా విస్మరించారని ప్రజలు మండిపడుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యం... ప్రజల ప్రాణాలు పణంగా

మున్సిపల్ అధికారులు తరచూ ఆ ప్రాం తంలో పర్యటించినా, కళ్లకు గంతలు కట్టుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారని స్థానికుల ఆరో పణ. ప్రజలు ఫిర్యాదులు చేసినా స్పదన లేకపోవడం, నిర్మాణదారుల అల్లరికి పరోక్షంగా ప్రోత్సాహం లభిస్తున్నట్లు కనిపిస్తోంది. చట్టానికి విరుద్ధంగా సాగుతున్న ఈ నిర్మాణాలు భవిష్యత్తులో ప్రమాదకర పరిస్థితులను సృష్టించే అవకాశముందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పారదర్శకతకు బదులు అవినీతి రాజ్యం

మున్సిపల్ కార్యాలయంలో పారదర్శకత లేకుండా అవినీతి బహిరంగంగా కొనసాగుతోందని ఆరోపణలు రావడం గమనార్హం. నిజాయితీగా నిబంధనలు పాటించే వారు నానా ఇబ్బందులు పడుతుంటే, కాగితాలపై లంచాలు ఇచ్చిన వారు ఒక్కరోజులోనే అనుమతులు పొందుతున్నారు. ఇది పాలనలోని అవినీతికి నిదర్శనంగా నిలుస్తోందని ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

అధికారులపై చర్యలు తీసుకోవాలి

సిద్దిపేట పట్టణంలో జరుగుతున్న ఈ విచ్చలవిడితనాన్ని ఆపేందుకు జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.  హైటె న్షన్ తీగల కింద జరుగుతున్న నిర్మాణాలను వెంటనే ఆపకపోతే, ఎప్పుడైనా ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

పట్టణంలో పారదర్శకతను నెలకొ ల్పి, అవినీతి బారిన పడిన మున్సిపల్ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజలు కో రుతున్నారు.సిద్దిపేట మున్సిపల్ పాలనలో ఉన్న ఈ నిర్లక్ష్యం, అవినీతి కొనసాగితే పట్ట ణం భద్రతకే కాకుండా ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు తప్పదని స్థానికులలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.