పొంచి ఉన్న ప్రమాదం
మహావృక్షం కూలితే మూడు ఇండ్లకు ప్రమాదం
వృక్షాన్ని తొలగించాలని అభ్యర్థన
ఇల్లందుటౌన్, సెప్టెంబర్16, (విజయక్రాంతి ): మహావృక్షం కూలితే మూడిన్లకు ప్రమాదం. ఆస్తి నష్టం తో పాటు ప్రాణ నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. ఆర్థిక స్తోమత లే క చెట్టును తొలగించే నాథుడే లేక బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఏ క్షణములో ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం 3వ వా ర్డు సివిల్ లైన్ కి చెందిన షేక్ హఫియా వ హీద్ దంపతులు తన ఇంటి ప్రాంగణంలో గల దర్గా వద్ద కొన్ని సంవత్సరాల నాటి మ హావృక్షం ఉంది. గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మహావృక్షం సగం విరి గి పోగా, మరో సగం దర్గా చుట్టుపక్కల గల ఇండ్ల పై వాలి ఉంది. దీంతో ఏ క్షణంలో చె ట్టు కూలిపడి ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుందోనని స్థానికులుబిక్కుబెక్కు మంటూన్నా రు.
వంగిన మహావృక్షా న్ని తొలగించడానికి వారు స్థానిక మున్సిపల్ కార్యాలయానీ ఆశ్రయిస్తే, మీరే తీసుకోండి మాకు అభ్యంతరం లేదంటూ సమాధానం రావడంతో విస్తుపోయారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది పట్టించుకోవట్లేదని వాపోతిన్నారు. కూలి ప ని చేసుకునే తాము వ్యక్తి గతంగా విరిగిపోయిన మహా వృక్షాన్ని తొలగించే ఆర్థిక స్తో మత లేదని, తక్షణమే ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగక ముందే ముందస్తుగా తొలగించాలని మున్సిపల్ కమిషనర్ కోరుతున్నామన్నారు.






