30 June, 2026 | 10:06 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలి

10-06-2025 12:38 AM

దౌల్తాబాద్, జూన్ 9: ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలని గజ్వేల్ ఏసిపి నర్సింలు అన్నారు. సోమవారం  దౌల్తాబాద్, రాయపోల్ పోలీస్ స్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, రోజు ఉదయం సాయంత్రం వాహనాలు తనిఖీ నిర్వహించి హెల్మెట్, సీట్ బెల్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, ఇన్సూరెన్స్ తదితర అంశాలపై వాహనదారులకు అవగాహన కల్పించాలన్నారు.  విపిఓ వ్యవస్థను మెరుగుపరచాలని వారంలో రెండు మూడు సార్లు గ్రామాలను సందర్శించాలని సిబ్బందికి సూచించారు.  తొగుట సిఐ లతీఫ్, దౌల్తాబాద్, రాయపోల్ ఎస్త్స్రలు శ్రీరామ్ ప్రేమ్ దీప్, రఘుపతి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.