25 July, 2026 | 3:35 PM

పంటల సాగుపై ప్రత్యేక శ్రద్ధ అవసరం

25-07-2026 03:03 PM

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని కరత్వాడ గ్రామపంచాయతీలో శనివారం గ్రామ సర్పంచ్ విశ్వేశ్వరరావు అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశంలో వ్యవసాయ విస్తరణ అధికారి కొట్టూరి రామ్ ఎల్ నీనో పంటల సాగుపై రైతులకు అవగాహన కలిగించారు. సమావేశంలో టెక్నికల్ అసిస్టెంట్ ఉపాధి హామీ కార్యక్రమంలో మంజూరైన పలు పనులను నీటి సంరక్షణ కోసం చేపట్టాల్సిన చర్యలను వివరించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సమ్రిన్ సుల్తానా, వార్డు సభ్యులు మహేష్ భీమ్రావు అంగన్వాడి టీచర్ తో పాటు ఫీల్డ్ అసిస్టెంట్ మండలి రాములు పాల్గొన్నారు.