25 July, 2026 | 3:34 PM

నేలలో విత్తనాలు వేసి.. ఆరుతడి పంటల సాగును ప్రారంభించిన కలెక్టర్

25-07-2026 02:58 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులను జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ కోరారు. జిల్లాలోని మరిపెడ మండలం ఎడ్జెర్ల గ్రామంలోని గిరిజన రైతు బాదావత్ వీరన్న బుజ్జి వ్యవసాయ భూమిలో పెసర విత్తనాలు వేసి పంట మార్పిడి విధానాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సూపర్ ఎల్నినో ప్రభావం వలన ఈసారి వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉన్నందున, రైతులు పంట మార్పిడి విధానం అవలంబించాలని, తక్కువ నీటి వినియోగం పంటల సాగు వల్ల ప్రస్తుత కరువు నేపథ్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని కలెక్టర్ చెప్పారు.అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రైతులకు రాయితీ ద్వారా ఆరుతడి పంటల సాగుకు అవసరమైన విత్తనాలను పంపిణీ చేశారు.