ఘనంగా వేణుగోపాలస్వామి రథోత్సవం
గజ్వేల్, మే 30 : సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని 800ల ఏండ్ల చరిత్ర కలిగిన వేణుగోపాలస్వామి ఆలయ వార్షికోత్సవా ల్లో భాగంగా గురువారం స్వామివారి విమా న రథోత్సవం పురవీధుల గుండా ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జామున వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య రథంలో రుక్మిణీ సత్యభామ సహితంగా వేణుగోపాలస్వామిని అధిష్టింపజేశారు.
ఉదయం 9గంట ల వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పురవీధుల గుండా స్వామివారి విమాన రథోత్స వాన్ని ఊరేగించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, మాజీ ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావుతో పాటు ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు విశేషసంఖ్యలో రథోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.






