31 July, 2026 | 1:27 AM

విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

31-07-2026 12:47 AM

ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి

బోధన్, జూలై 30 (విజయక్రాంతి): బోధన్లోని ప్రైవేట్ విద్యాసంస్థల ప్రతినిధులు ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డిని నిజామాబాద్ ఆయన నివాసంలో మదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వర్షాకాలంలో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.

పాఠశాలల్లో అవసరమైన భద్రతా చర్యలు తప్పనిసరిగా అమలు చేయాలని, ముఖ్యంగా స్కూల్ బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ల అర్హతలు, వాహనాల భద్రతా ప్రమాణాలు, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని విద్యాసంస్థల యాజమాన్యాలకు ఆదేశించారు. విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వొద్దని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.