calender_icon.png 30 December, 2025 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెట్ పరీక్షకు ప్రత్యేక బస్సులు

30-12-2025 08:17:40 PM

నిర్మల్,(విజయక్రాంతి): జనవరి 3వ తేదీ రోజు టెట్ పరీక్షల కొరకు అభ్యర్థుల కోరిక మేరకు ఖమ్మం, సత్తుపల్లి లకు ప్రత్యేక సూపర్ లక్సరి బస్సులు నడుపుతున్నట్లు డిపోమేనేజర్ కే.పండరి తెలిపారు. ఈ బస్సు 3 జనవరి రోజు రాత్రి 9 గంటలకు నిర్మల్ బస్టాండ్ నుండి బయలుదేరి 4వ తేదీ ఉదయం 6 గంటలకు ఖమ్మం చేరుకుంటుంది.

అదే విధంగా 4వ తేదీ రోజు సాయంత్రం 6 గంటలకు ఖమ్మం నుండి బయలు దేరి రాత్రి 12 గంటలకు నిర్మల్ చేరుకుంటుంది. అదే విధంగా అభ్యర్థులు ఎక్కువ మొత్తం లో ఉంటే సత్తుపల్లికి కూడా బస్ సౌకర్యం కలిపిస్తామని డిపోమేనేజర్ తెలిపారు. ఈ సౌకర్యాన్ని సద్వినియోగ పరచుకోవాలని, మరిన్ని వివరాలకొరకు 7382842394లో సంప్రదించాలని కోరారు.