30-12-2025 08:20:22 PM
- మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ
దండేపల్లి,(విజయక్రాంతి): మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చి పథకాన్ని నిర్వీర్యం చేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు డిమాండ్ చేశారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు మంగళవారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఉపాధి కూలీలతో కలిసి నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా జిల్లా మాజీ డీసీసీ సురేఖ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేకత తప్పదన్నారు. మహాత్మా గాంధీ పేరు ఉపాధి పథకం నుంచి తీసేస్తే దేశ వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. గత UPA ప్రభుత్వం ఇచ్చినట్టుగా కేంద్ర ప్రభుత్వం 99 శాతం నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని DRDO కిషన్ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి కార్పోరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, RGPRS జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.