calender_icon.png 6 February, 2026 | 3:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెరుగైన ఫలితాల సాధనకు ప్రత్యేక కృషి

01-02-2026 12:00:00 AM

వర్చువల్‌గా పాల్గొన్న డీప్యూటీ సీఎం భట్టి

సికింద్రాబాద్ జనవరి 31 (విజయ క్రాంతి): పది, ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్నారు. ఉత్తమ ఫలితాలు సాధన, మౌలికోస్తులు కల్పనపై వర్చువల్ సమావేశం నిర్వహించారు. 2025--26 విద్యాసంవత్సరానికి రాబోయే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు అలాగే ఎస్‌ఎస్సి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి,అన్ని ప్రభుత్వ మరియు వెల్ఫేర్ మేనేజ్మెంట్ స్కూళ్లు, కళాశాలల అధ్యక్షులు, ప్రిన్సిపాల్స్‌తో వర్చువల్‌లో పాల్గొన్నారు.

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్య తీస్తుందని,  కార్పొరేట్ స్థాయికి దీటుగా విద్య బోధన అందించడం జరుగుతుందని అన్నా రు. అనంతరం అన్ని మేనేజ్మెంట్లలో ఉత్తమంగా పనిచేసిన స్కూళ్లు, కళాశాలలను అభినందించి,ఈ సంవత్సరం మెరుగైన  ఫలితాలు కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వర్చువల్ గా జిల్లా శాఖ అధికారి  రోహిణి,జిల్లా ఇంటర్మీడియట్ అధికా రి ఒడ్డెన్న ,అన్ని వెల్ఫేర్ సొసైటీల జిల్లా అధికారులు ,ఆర్సివోలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.