6 March, 2026 | 8:40 PM

సోమసుందర్ నగర్ పార్క్ సమస్యలు పరిష్కరించాలి

01-02-2026 12:00 AM

అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

ముషీరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): అంబర్‌పేట నియోజకవర్గం బాగ్ అంబర్‌పేట డివిజన్‌లోని సోమ సుందర్ నగర్ పార్కులో అన్ని మౌలిక సదుపాయా లు కల్పించాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలే రు వెంకటేష్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కార్పొరేటర్ పద్మా వెంకట్ రెడ్డితో కలిసి బాగ్ అంబర్పేట్ డివిజన్ పరిధిలోని సోమ సుందర్ నగర్ పార్క్ ను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీలోని మహిళా విభాగంతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ అధికారులు డీఈ ప్రవీణ్, ఏఈ రామిరెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ రవి,  యూ బీడీ శ్రీధర్,  ఎంటమాలజిస్ట్ ఏఈ అంబిక, జలమండలి అధికారి మాజీద్, బాగ్ అంబర్‌పేట్ డివిజన్ అధ్యక్షులు చంద్రమోహన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.