గోదావరి పుష్కరాలపై ప్రత్యేక దృష్టి
- టైర్1 పనుల అమలుకు పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక
- భూసేకరణ ప్రతిపాదనలు సిద్ధం
కరీంనగర్, సెప్టెంబరు 8 (విజయక్రాంతి): గోదావరి పుష్కరాలు(Godavari Pushkaralu) 2027జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్నాయి. మొత్తం 12 రోజులపాటు పుష్కరాలు కొనసాగనున్నాయి. భక్తుల తాకిడి లక్షల్లో ఉం టుంది కనుక రాష్ట్ర ప్రభుత్వం(State Government) కుంభమేళా ను తలపించే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. గోదావరి పుష్కరాల సందర్భంగా టైర్1లో ప్ర తిపాదించిన అన్ని అభివృద్ధి పనులు(Development works) అమలయ్యేలా అవసరమైన కార్యాచరణ ప్రణాళి కను పకడ్బందీగా అమలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్(Endowments Department Principal Secretary Shailaja Ramaiyar) గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఇప్పటికే జగిత్యా ల, పెద్దపల్లి జిల్లా(Peddapalli District) కలెక్టర్లకు దిశానిర్దేశనం చేశారు. గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని ధర్మపురిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా సోమవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించా రు. జగిత్యాల జిల్లా(Jagtial District)లో గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ(Land acquisition process)ను వేగవంతం చేశారు.
జగిత్యాల పరిధిలో 4.32 ఎకరాలు, కోటిలింగాలలో 3 ఎకరాల భూసేకరణకు సంబంధించి మొత్తం 9.25 కోట్ల రూపాయల విలువైన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపిచారు. టైర్1 పనులలో నీటిపారుదల శాఖ పరిధిలో ఘాట్లు, ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి ఈనెల 7న ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. దేవాదాయ శాఖ పరిధిలో టైర్1 కింద 20 కోట్ల విలువైన 13 పనులు ఉండగా, ఇప్పటికే 8 పనులకు ఎల్‌ఓఏలు జారీ అయ్యయి.
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ పరిధిలో టైర్1 కింద 12 పనులకు సంబంధించి 59 కోట్ల విలువైన పనులు ఉన్నాయి. సాంకేతిక అనుమతులు రావలసి ఉంది. పెద్దపల్లి జిల్లాలో కూడా ఈ టైర్-1 స్థానాలను ప్రత్యేకంగా గుర్తించి, అక్కడ శాశ్వత ప్రాతిపదికన మౌలిక వసతుల కల్పన, భద్రతా ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. టైర్-1 పరిధిలోనివి పెద్దపల్లి జిల్లాలో గోదావరి నది తీరాన ఉన్న మంథని గౌతమేశ్వర ఆలయం, గోదావరిఖని సమ్మక్క-సారలమ్మ జాతర ప్రాంతం, పట్టణ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతం.
గోలివాడ పాత ఘాట్ దెబ్బతినడంతో ఇక్కడ ప్రత్యేక అభివృద్ధి పనులు చేపట్టారు. సుంది ళ్ల (లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం) బ్యారే జీ పరిసర ప్రాంతం కావడం వల్ల ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రద్దీ తట్టుకునేలా ప్రభుత్వం కేంద్రాల్లో పనులను చేపడు తున్నారు. మంథని గౌతమేశ్వర ఆలయం వద్ద ఉన్న పాత ఘాట్ విస్తరణతో పాటు, దెబ్బతిన్న గోలివాడ ఘాట్ స్థానం లో సరికొత్త నూతన స్నానాల ఘాట్లను నిర్మిస్తు న్నారు. ఘాట్లకు వెళ్లేందుకు ప్రత్యేక అప్రోచ్ రోడ్లను ఏర్పాటు చేస్తున్నారు.
మంథని పట్టణంలోని అన్ని ప్రధాన ఆలయాలకు భక్తులు సులభంగా చేరుకునేలా అంతర్గత రహదారుల నిర్మాణాన్ని, ప్రధాన రహదారుల విస్తరణ పనులను పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి శాఖల ఆధ్వర్యంలో వేగవంతం చేశారు. అత్యవసర సేవలు, విఐపిల రాకపోకలు, భద్రతా పర్యవేక్షణ కోసం మంథని పుష్కర ఘాట్ సమీపంలో ప్రత్యేకంగా ఒక హెలిప్యాడ్ ను నిర్మిస్తున్నారు.
టైర్-1 కేంద్రాలలో భారీగా తరలివచ్చే భక్తుల రద్దీని , ట్రాఫిక్ ను నియంత్రించడానికి ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేస్తున్నారు.