అన్నది నా తల్లిని.. మీకెందుకు ఆవేశం?
మహిళా సభ్యుల పట్ల గౌరవం ఉంది
మాజీమంత్రి హరీశ్‌రావుపై శాసన సభాపతి గడ్డం ప్రసాద్ ఆగ్రహం
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): ‘శాసనమండలి(Legislative Council) సభ్యుడు అనుచితంగా అన్నది మీ తల్లిని కాదు, నా తల్లిని’ అని మాజీమంత్రి హరీశ్‌రావు(Harish Rao)పై శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్(Gaddam Prasad Kumar) ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లిపై చేసిన వ్యాఖ్యలకు హరీష్‌రావు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఆవేశం తనకు ఉండా లని, బీఆర్ఎస్ నేతల(BRS leaders)కు కాదని హితవు పలికారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం(Telangana Assembly premises)లో సోమవారం ఉదయం జరి గిన ఘటనలపై మంగళవారం సభలో వాగ్వాదం సాగిం ది.
రెండో రోజు సభకు బీఆర్ఎస్ సభ్యులు నల్లబ్యాడ్జీలతో హాజరయ్యారు. ‘ఇది దుర్యోధన ప్రభుత్వం.. ధృతరాష్ట్ర పాలన’ అని రాసిన ప్లకార్డ్‌లను ప్రదర్శించారు. సీనియర్ మహిళా సభ్యులు సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy), సునీతా లక్ష్మారెడ్డి(Sunitha Laxma Reddy)ని అవమానించిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై జరిగిన దాడికి సంబంధించి నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామన్నారు. మహిళా సభ్యులంటే సభతో పాటు తనకు కూడా గౌరవం అన్నారు.
‘మీరు చెబితే నేను వినట్లేదా? నేను మాట్లాడుతుంటే మీకు ఎందుకంత ఆవేశం’ అని హరీశ్‌రావును సభాపతి ప్రశ్నించారు. ‘మీకు కాదు ఆవేశం నాకు ఉండా లి. మీ తల్లిని అనలేదు, నా తల్లిని అన్నారు‘ అని భావోద్వేగానికి గురయ్యారు. సబితా ఇంద్రారెడ్డి, సునీత, కోవా లక్ష్మిపట్ల తనకు గౌరవం ఉందని స్పీకర్ అన్నారు. వారికి జరిగిన అసౌకర్యానికి నివేదిక కావాలని ఆదేశించినట్లు తెలిపారు. రిపోర్టు రాగానే దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటామని హరీశ్‌రావుకు స్పష్టం చేశారు.
క్షమాపణ చెప్తారనుకున్నా..: సభాపతి
శాసనసభను తాను ఎల్లప్పుడూ అత్యంత ప్రజాస్వామ్యయుతంగా నడిపించానని, అయితే సభాపతి స్థానాన్ని అవమానించిన ఘటనపై సభలో మాట్లాడిన మాజీ మంత్రి హరీశ్ క్షమాపణ చెబుతారని భావిస్తే, ఆయ న అసలు విషయాన్ని పక్కదారి పట్టించేలా మాట్లాడారని సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మీడియా ప్రతినిధుల చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులను చూడలేదని, ఈ ఘటనతో రాష్ట్రమంతా అట్టుడుకుతోందని పేర్కొన్నారు.
గతంలో కేసీఆర్ వ్యవహరించినట్లుగా తాము నియంతృత్వంగా వ్యవహరించలేదని, విపక్ష సభ్యులపై వెంటనే అనర్హత వేటు కూడా వేయలేదని గుర్తుచేశారు. బీఆర్ఎస్ మ హిళా సభ్యులపై జరిగిన ఘటన ఆరోపణలను కూడా నిశితంగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే అసెంబ్లీ వద్ద కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, నవీన్ రెడ్డిలు పోలీసులపై భౌతిక దాడికి దిగినట్లు స్పష్టంగా కనిపించిందని తెలిపారు.
తమ ప్ర భుత్వం కొత్తగా ఎలాంటి ఆంక్షలు విధించలేదని, 2014లో కేసీఆర్ హయాంలో రూ పొందించిన అసెంబ్లీ నిబంధనలనే తాము అమలు చేస్తున్నామని, టీ-షర్టులపై నినాదా లు ఉండటం వల్లే వాటిని సభలోకి అనుమతించలేదని స్పీకర్ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ అదానీ చిత్రాలున్న దుస్తులతో పార్లమెంటుకు వెళ్లిన విషయం తాను చూడలేద న్నారు. ప్రతి అసెంబ్లీ సమావేశాల కంటే ముందే ప్రతిపక్ష నేతలకు మర్యాదపూర్వకంగా ఫోన్ చేసే సంప్రదాయం ప్రకారం తాను కేసీఆర్‌కు కూడా ఫోన్ చేశానని, ఆరో గ్యం బాగుంటే సభకు హాజరవుతానని ఆయ న చెప్పారని వెల్లడించారు.
సభ గౌరవాన్ని కాపాడేందుకు ఎవరిపైనైనా కఠిన చర్యలు తీసుకునే పూర్తి రాజ్యాంగబద్ధ అధికారాలు స్పీకర్‌కు ఉంటాయని స్పష్టం చేశారు. తాజా పరిణామాలతో మంగళవారం సమావేశాలను తాను నడపలేనని, అందుకే సమావేశా లను ప్యానెల్ స్పీకర్ కడియం శ్రీహరి అధ్యక్షతన నడిపించినట్టు వెల్లడించారు.