ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక వైద్య శిబిరం
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా కోనరావుపేట పీహెచ్‌సీలో బహుళ వైద్య నిపుణులతో ప్రత్యేక వైద్య శిబిరం
కోనరావుపేట,(విజయక్రాంతి): ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో(Praja Palana - Pragathi Pranalika) భాగంగా కోనరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు.మండల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయగా,స్థానిక గ్రామ సర్పంచ్ మస్కురి కాశీరం రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల ప్రజలు ఇలాంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్య సమస్యలను నిపుణులైన వైద్యులతో పరీక్షించించుకోవాలని సూచించారు.
ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తోందని, గ్రామస్థులు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలని అన్నారు.ఈ వైద్య శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు పాల్గొని రోగులను పరీక్షించి అవసరమైన చికిత్సలు అందించారు. డా. కావ్య శ్రీ (స్త్రీల వైద్య నిపుణులు), డా. జ్యోస్న (జనరల్ మెడిసిన్), డా. సాయి కల్యాణ్ (పిల్లల వైద్య నిపుణులు),నవ్య (కంటి వైద్య నిపుణులు), డా. ప్రవీణ్ వర్మ (ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు), డా. వెంకట సాయి దీప్ (దంత వైద్య నిపుణులు) తమ తమ విభాగాల్లో రోగులను పరీక్షించి అవసరమైన వైద్య సూచనలు చేశారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రత్యేక వైద్య సేవలు అందించడంలో ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగకరమని వైద్యులు పేర్కొన్నారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అవసరమైన మందులు కూడా అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డా. సురేష్ కుమార్,ఉప సర్పంచ్ రేణుక, వార్డు సభ్యులు చింతల పర్శరాములు, జింక వెంకటి సూపర్వైజర్ లు రషీద్, సువర్ణ, మెర్సి, చిరంజీవి, ఎం ఎల్ హెచ్ పి లు అరుణ్ చంద్, చందు, మధు, సన్నిహిత, హరీష్, ఏఎన్ఎం, ఆశ వర్కర్,ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్ట్, టెక్నీషియన్స్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, వైద్య సిబ్బంది మరియు మండల ప్రజలు గ్రామస్థులు పాల్గొన్నారు.




