21 April, 2026 | 2:00 AM

కేజీబీవీ బాలికల వసతిగృహాన్ని సందర్శించిన ప్రత్యేక అధికారి

21-04-2026 12:20 AM

కామారెడ్డి అర్బన్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): 99 రోజుల కార్యచరణ ప్రణాళిక ప్రకారం సంక్షేమ హాస్టల్లో పర్యవేక్షణలో భాగంగా మన దోమకొండ మండలంలో ప్రత్యేక అధికారిని జ్యోతి ,ప్రవీణ్ కుమార్ ఎంపీడీవో కేజీబీవీ బాలికల వసతిగృహమును సందర్శించి అక్కడ ప్రభుత్వం ఏదైతే మౌలిక వసతులు కల్పిస్తుందో వాటిని సక్రమంగా విద్యార్థినిలకు అందుతున్నాయా లేదా అనే విషయంలో పరిశీలించారు.

మెనూ ప్రకారం భోజనం అందించాలని పరిశుభ్రత పాటించాలని సంబంధిత ప్రిన్సిపాల్ కి ఆదేశించారు. 2002. 26 అకాడమీ  సంవత్సరం లో ఇంటర్మీడియట్ విద్యార్థులు 98% ఉత్తీర్ణులైనరని  సంబంధిత ప్రిన్సిపాల్  తెలపడం జరిగింది వారికి  అభినందనలు తెలియజేయడం జరిగింది.

అట్లాగే దోమకొండ మండలంలోని బీసీ సంక్షేమ వసతిగృహము బాలురును సందర్శించడం జరిగింది ఇందులో భాగంగా పిల్లలు అందరూ వేసవి సెలవులు ఉన్నందున ఇంటికి వెళ్లినారని సంబంధిత వార్డన్ తెలిపినారు. అక్కడ ఉన్న మౌలిక వసతులను పరిశీలించి భవనం యొక్క స్లాపు శిథిలావస్థలో ఉన్నదని ,వంటశాల గది రేకులు సక్రమంగా, లేవని మరియు మరుగుదొడ్లు మరమ్మతులు చేయుటకు గాను  జిల్లా కలెక్టర్ కి ఇట్టి ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సంబంధిత ప్రిన్సిపాల్ మంగమ్మ, స్వామి సిబ్బంది పాల్గొన్నారు.