ఎల్లారెడ్డిలో ఘనంగా మహాత్మ బసవ జయంతి
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 20 (విజయకాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో సోమవారం మహాత్మా బసవ జయంతి ఘనంగా నిర్వహించారు. వీర శైవ జంగమ లింగాయత్ ఆధ్వర్యంలో మహాత్మ బసవేశ్వర జయంతి సందర్భంగా నీల వెంకటేశ్వర్ ఆలయంలో ఉదయం పూజలు నిర్వహించి అనంతరం బసవేశ్వర విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా బసవేశ్వర జయంతి వేడుకలను నిర్వహించారు.
అనంతరం ఎల్లారెడ్డి మండల వీర సేవ లింగాయత్ అధ్యక్షుడు ముత్తి వీరప్ప, లింగాయత్ సభ్యులు మాట్లాడుతూ. మహాత్మ బసవేశ్వరుడు 1134.. 1196, 12వ శతాబ్దానికి చెందిన గొప్ప భారతీయ తత్తేవేత సంఘ సమస్కర్త, కవి ,లింగాయత్ ధర్మ స్థాపికుడని పేర్కొన్నారు. కుల వ్యవస్థ లింగ వివక్షత, మూఢనమ్మకాలపై పోరాడి అనుభవ. మటపం ద్వారా సమానత్వం, సత్యం, శ్రమ ,గౌరవాన్ని, ప్రచారం చేసిన మహనీయుడని వివరించారు. ప్రపంచ దేశాల్లోని మహాత్మ బసవేశ్వరుడు. వీరశైవ లింగాయత్ లను. యావత్ భారతదేశానికి ప్రపంచానికి పరిచయం చేశాడని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కపిల్ బసప్ప. జంగం సంగప్ప. నాయి కోటి రవీందర్. శ్రీరామ్. హనుమంతప్ప.అనిల్. శేఖర్. భరత్. పి రవీందర్. రామప్ప. మహిళలు తదితరులు పాల్గొన్నారు






