17 April, 2026 | 9:29 PM

Breaking News

గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •   సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన   •   హిందూ సమ్మేళనం ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర వాహనాల ర్యాలీ   •  

వేములవాడ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు

23-06-2025 12:00 AM

రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల: జూన్ 22(విజయక్రాంతి)వేములవాడ పట్టణానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు..ఆదివారం వేములవాడ పట్టణంలోని 3వార్డు లక్ష్మీపురం ,17 వార్డు శాస్త్రినగర్,18 వార్డు గాంధీ నగర్ లో 32 లక్షలతో సైడ్ డ్రైన్, సీసీ రోడ్లు సీసీ కల్వర్టుల నిర్మాణనికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు.

అనంతరం మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల సంక్షేమమే పరమావధిగా ముందుకు పోతున్నామని అన్నారు.వేములవాడ పట్టణంరాజన్న ఆలయం రెండు కళ్ళలలగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తానని తెలిపారు.

స్ధానిక నాయకులు మాట్లాడుతూరాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నాయకత్వంలో వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపారు.52 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రాజన్న ఆలయం ముందు రోడ్డు విస్తరణ ప్రభుత్వ విప్ నాయకత్వంలో ముందు అడుగు పడినట్లుతెలిపారు.