17 April, 2026 | 11:08 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

గడ్డపోతారంలో ఉచిత వైద్యశిబిరం

23-06-2025 12:01 AM

పటాన్ చెరు, జూన్ 22 : గడ్డపోతారం మున్సిపాలిటిలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. లీ ఫార్మా పరిశ్రమ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని లీ ఫార్మా పరిశ్రమ డైరెక్టర్ కిరణ్ కుమార్ గడ్డపోతారం మాజీ సర్పంచ్ ప్రకాష్ చారితో కలిసి ప్రారంభించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ వైద్యులు వైద్య, కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కంటి అద్దాలు అందజేశారు.

మున్సిపల్ పరిధిలోని ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు.  లీఫార్మా పరిశ్రమ డైరెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లీ ఫార్మా పరిశ్రమ ప్రతినిధి చలం, లయన్స్ క్లబ్ ప్రతినిధులు కోమల్ రెడ్డి, ప్రకాష్, నరేంద్రబాబు, ఎంఎస్ రెడ్డి, మౌలా అలీ తదితరులుపాల్గొన్నారు.