వర్షాల కోసం ప్రత్యేక పూజలు
27-06-2026 12:00 AM
వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని కోరుతూ గ్రామస్థులు ప్రత్యేక పూజలు
బోధన్, జూన్ 26 (విజయక్రాంతి): బోధన్ మండలంలోని ఎరాజ్పల్లిలో వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని కోరుతూ గ్రామస్థులు ప్రత్యేక పూజలు చేశారు. గోదావరి జలాలను గ్రామానికి తీసుకువచ్చి గ్రామదేవతలకు అభిషేకాలు చేశారు. బాజాభజంత్రీలు, సంప్రదాయ నృత్యాల నడుమ సాగిన గోదావరి జలాల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటి నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






