27 June, 2026 | 2:27 AM

మోకిలలో గంజాయి పట్టివేత

27-06-2026 01:27 AM

ఐదుగురి అరెస్టు..

శంకర్ పల్లి జూన్ 26 (విజయక్రాంతి): అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న సంఘటన మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రారెడ్డి నగర్ వద్ద గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. చేవెళ్ల జోన్ ఎస్‌ఓటి పోలీసులు, మోకిల పోలీసులు సంయుక్తంగా విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించి ఈ ముఠాను అరెస్టు చేయడం జరిగింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

బీహార్ కు చెందిన పులేందర్ సింగ్, మహేష్ కుమార్, సందీప్ కుమార్, ఒడిస్సాకు చెందిన సుజిత్ బైరాగి, శంకర్ పల్లి మండలంలోని కొండకల్ గ్రామానికి చెందిన మహమ్మద్ జావిద్ ఐదు మంది కలిసి ఒరిస్సా రాష్ట్రంలోని గంజాయి సరఫరా దారుల నుండి ఈ గంజాయిని హైదరాబాద్ కు తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందని పోలీసులు తెలిపారు. నిందితుల నుండి  8.75 కిలోల గం జాయి, ౫ మొబైల్స్, ఒక బైక్, రూ.4200 నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి న్యా యస్థానం ముందు హాజరుపరచడం జరిగింద ని మోకిల సిఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మ రకద్రవ్యాల రవాణా, వినియోగం, నిల్వలపై కఠినంగా వ్యవహరిస్తున్నామని, ఎవరై నా విక్రయించిన, వినియోగించినా తమకు సమాచారం అందించాలని కోరారు.