27 June, 2026 | 2:42 AM

పంట పరిహారం ఆగింది!

27-06-2026 01:26 AM
  1. అకాల వర్షాలతో ఈ ఏడాది నీటమునిగిన లక్షలాది ఎకరాలు
  2. రాష్ట్రవ్యాప్తంగా వందలాది కోట్ల పంట నష్టం
  3. నేటికీ అందని ఇన్‌పుట్ సబ్సిడీ
  4. వానాకాలం పెట్టుబడుల వేళ అన్నదాతల పాట్లు

సంగారెడ్డి, జూన్ 26 (విజయక్రాంతి) : రాష్ట్రంలోని అన్నదాతలను ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు కోలుకోలేని దెబ్బతీస్తుంటే, ప్రభుత్వ యంత్రాంగం ఉదాసీనత, నిధుల కొరత వారిని మరింత కుంగదీస్తోంది. ఈ ఏ డాది మార్చి చివరి వారం నుంచి మే నెలాఖరు వరకు రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్ల వానల వల్ల లక్షలాది ఎకరాల్లో యాసంగి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

నష్టపోయి నెలలు గడుస్తున్నా బాధితులకు అందాల్సిన పంట నష్టపరిహారం (ఇన్‌పుట్ సబ్సిడీ) పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ ఏడాది మార్చిలో కురిసిన వర్షాలకు తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, మంచిర్యాల, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పదివేల ఎకరాల్లో మిర్చి, వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 33వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. మే చివరి వారంలో గాలివానల వల్ల పలు జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది.

టార్పాలిన్లు లేకపోవడం, ఐకేపీ కేంద్రాల్లో కొనుగోళ్లలో జాప్యం వల్ల వందలాది క్వింటాళ్ల జొన్నలు, వరి వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. మరోవైపు కొత్త సీజన్‌కు సంబంధించి రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ చేయడానికే ప్రభుత్వం దాదాపు రూ.9 వేల కోట్ల ని ధుల సమీకరణ కోసం తీవ్ర కసరత్తు చేస్తోం ది. ఈ నేపథ్యంలో పాత బాకీలైన పంట నష్టపరిహార నిధులను విడుదల చేయడం ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. 

బీమా లేకుంటే శాపమా?

తెలంగాణలో సమగ్రమైన పంట బీమా పథకం అమలులో లేకపోవడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ప్రతిసారీ రైతులు పూర్తిగా నష్టపోవాల్సి వస్తోంది. కేంద్ర ప్రభు త్వ ఫసల్ బీమా యోజన లేదా రాష్ట్ర ప్రభు త్వ ప్రత్యేక బీమా గ్యారెంటీలను పూర్తిస్థాయిలో వర్తింపజేయాలని, అప్పుడే రైతులకు శాశ్వత ఆర్థిక భద్రత దక్కుతుందని వ్యవసాయ రంగ నిపుణులు సూచిస్తున్నారు. పంటల సీజన్ ప్రారంభానికి ముందే ప్రభుత్వం బీమాకు సంబంధించిన అధికారిక గెజిట్ లేదా నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది.

కానీ ప్రస్తుత వానాకాలం (ఖరీఫ్) సీజన్కు సంబంధించి ఇలాంటి ప్రకటనలు ఏవీ వెలువడలేదు. 2020లో నాటి ప్రభు త్వం ప్రీమియం భారం, క్లెయిమ్‌ల ్ల చెల్లింపుల్లో జాప్యం వంటి కారణాలతో పీఎంఎప్ బీవై పథకం నుంచి తప్పుకుంది. కొత్త ప్రభు త్వం దీనిని పునరుద్ధరిస్తామని చెప్పినా, ఆచరణలో ఇంకా పూర్తిస్థాయిలో రైతులకు లబ్ధి చేకూరడం లేదు. ఇలావుండగా ప్రభుత్వ నో టిఫికేషన్లు, సబ్సిడీల వాటా స్పష్టంగా లేకపోవడంతో ప్రైవేట్ లేదా ప్రభుత్వ బీమా కంపె నీలు క్షేత్రస్థాయిలో పంట నష్టాల అంచనా వేయడానికి ముందుకు రావడం లేదు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో పరిస్థితి

మెదక్ జిల్లాలో ఇటీవలి యాసంగి (ఏప్రిల్-మే) వడగండ్ల వానలకే ఇక్కడ 4,777 ఎక రాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో కే వలం వరి పంటే 4,701 ఎకరాలు కాగా, మిగిలినవి మామిడి తోటలు (63 ఎకరాలు), మొక్కజొన్న ఉన్నాయి. అంతకు ముందు కురిసిన భారీ వర్షాల వల్ల మరో 16,230 ఎకరాల్లో పంట నష్టం నమోదైంది. సిద్దిపేట జిల్లాలో గాలివానలు, అకాల వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా 7,345 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పత్తి పంటలు నీట మునిగాయి.

సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్, ఆందోల్, పుల్కల్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 2,208 ఎకరాల్లో ఆలుగడ్డ, కూరగాయలు, చెరుకు, వరి పంటలు దెబ్బతిన్నాయి. గతంలో ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేల చొప్పున సహాయం ప్రకటించినప్పటికీ, ఉమ్మడి మెదక్ జిల్లాలో సవరించిన అంచనాల పేరుతో లబ్ధిదారుల సంఖ్యను తగ్గిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. 

కౌలు రైతు పరిస్థితి దయనీయం

పంట బీమా పథకాలు లేకపోవ డం వల్ల సాధారణ రైతులతో పోలిస్తే కౌలు రైతులు దారుణంగా నష్టపోతున్నారు. భూమి యజమానికి కౌలు చెల్లించి, విత్తనాలు, ఎరువుల కోసం వే లాది రూపాయలు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టిన వీరికి పంటలు చేతికి రాకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. గతంలో హైకోర్టు సైతం కౌలు రైతులతో సహా అందరికీ విపత్తు నిధుల నుంచి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ఆదేశించినప్పటికీ, ఆచరణలో క్షేత్ర స్థాయి పరిశీలనలు మొ క్కుబడిగా సా గుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.