10 July, 2026 | 3:49 AM

వర్షాల కోసం ప్రత్యేక పూజలు

10-07-2026 01:58 AM

తాడ్వాయి, జూలై, 9( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ని చిన్న దేమి శివారులో గురువారం మైసమ్మ ఆలయంలో గ్రామస్తులు వర్షాల కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

వర్షా కాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న ఇప్పటికి వర్షాలు పడకపోవడంతో చాలామంది రైతులు పంటలు వేయలేదు వేసుకున్న పంటలు ఎండిపోతున్నాయి. వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురిపించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజిరెడ్డి,గంగారెడ్డి,భూపతి రెడ్డి,రాజు, రామ్ రెడ్డి, చంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.