10 July, 2026 | 3:50 AM

బిల్డథాన్ పోటీల్లో జెడ్పీ హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ

10-07-2026 01:58 AM

వెల్దుర్తి, జులై 9 : మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వెల్దుర్తి విద్యార్థులు వికసిత్ భారత్ బిల్డథాన్ పోటీలలో ప్రతిభ కనబరిచారు. పాఠశాలకు చెందిన మహమ్మద్ నాసర్ మోహిద్దీన్ , లిఖిత బృందం రెండు విభాగాల్లో ఎంపిక కావడం విశేషమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబయ్య తెలిపారు.

వీరు వాహనాలు వెళ్లేటప్పుడు రోడ్లపై విద్యుత్తును ఉత్పత్తి చేసే పీజోఎలక్ట్రిక్ ప్లేట్లు,  శిలాజ ఇంధనాలకు బదులుగా హరిత శక్తి వినియోగం. ఈవెంట్లలో తమ వినూత్న ఆలోచనలు, ప్రాజెక్టు లతో ఎంపికై పాఠశాలకు గౌరవం తీసుకొచ్చారని విద్యార్థులను కొనియాడారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం సాంబయ్య, టీచర్లు విద్యార్థులను అభినందించి, వారి విజయానికి కృషి చేసిన మార్గదర్శక ఉపాధ్యాయుల ను ప్రశంసించారు.