17 July, 2026 | 12:41 AM

వర్షాల కోసం కప్పతల్లి ఆట

17-07-2026 12:41 AM

మచ్చుపేటలో ప్రత్యేక పూజలు

ముత్తారం, జులై 16 (విజయక్రాంతి): వర్షాభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని మచ్చుపేట గ్రామంలో గ్రామస్తులు సంప్రదాయ పద్ధతిలో కప్పతల్లి ఆట నిర్వహించి వర్షాలు కురవాలని గురువారంప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, చెరువులు నిండి రైతాంగం సుభిక్షంగా ఉండాలని గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో దేవుడిని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిలివేరి జ్యోతిలక్ష్మణ్ ఆధ్వర్యంలో చిలివేరి భూమయ్య, గొర్ల స్వామి, బొడ్డు రాజేశం, ఎలగందుల భూమయ్య, మడ్డి రాజు, గరగంటి మదనయ్య, తిరుమల రాజు, చిలివేరి లింగయ్య, కాసులాల్ కుమార్, కీసరి రమేష్, ముత్తే లక్ష్మయ్య, కానిగంటి మొగిలి, తాళ్ల రాయమల్లు, అలిశెట్టి మధుకర్, కంచు రమేష్, కీసరి రాములు, కొట్టే బనయ్య, పులిపాక ఓదెలు, లల్లు, యశ్వంత్, జానీ, సన్నీతో పాటు గ్రామ రైతులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.గ్రామస్తులు మాట్లాడుతూ, త్వరలో మంచి వర్షాలు కురిసి పంటలు పుష్కలంగా పండాలని, రైతుల కష్టాలు తొలగాలని ఆకాంక్షించారు. గ్రామంలో ఐకమత్యంతో నిర్వహించిన ఈ సంప్రదాయ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.