21 July, 2026 | 11:14 AM

వర్షాలు కురవాలని బొడ్రాయికి ప్రత్యేక పూజలు

21-07-2026 12:00 AM

కడ్తాల్, జూలై 20 (విజయక్రాంతి): వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ కడ్తాల్ గ్రామంలో మాజీ సర్పంచ్ లక్ష్మీ నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ దేవత బొడ్రాయికి నీళ్లతో అభిషేకం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సాగు కాలంలో సరైన వర్షాలు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని, వర్షాభావంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతన్నలను వాన దేవుడు కరుణించాలని వేడుకున్నట్లు తెలిపారు.

బొడ్రాయి సాక్షిగా త్వరలోనే వర్షాలు కురిసి రైతుల కష్టాలు తీరుతాయని గ్రామస్తులంతా ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ కడారి రామకృష్ణ, గూద రాములు, ఎలగమోని సత్యం, మూడ అశోక్, బోసు బుచ్చయ్య, గ్రామ పెద్దలు, మహిళలు మరియు రైతులు పాల్గొన్నారు.