21 July, 2026 | 11:23 AM

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

21-07-2026 12:00 AM

బీజేపీ మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ 

ఘట్ కేసర్, జూలై 20 (విజయక్రాంతి) : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భారతీయ జనతా పార్టీ మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బిజెపి పోచారం డివిజన్ కార్యవర్గ సమావేశం సోమవారం పోచారం డివిజన్ అధ్యక్షులు  ననావత్ సురేష్ నాయక్ అధ్యక్షతన  అన్నోజిగూడలోని శివాస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. 

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రూరల్ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ విచ్చేసి బిజెపి జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో బిజెపి పై రోజురోజుకీ విశ్వాసం పెరుగుతోందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అంత్యోదయ లక్ష్యంతో సమాజంలోని ప్రతి వర్గానికీ చేరుతున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు బిక్కునాయక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు  గొంగళ్ళ బాలేష్, మాజీ కౌన్సిలర్ మహేష్, పాండురాజ్, కళ్యాణ్ నాయక్, శివనాయక్, అజయ్, డిటీ నాయక్, డివిజన్ ఉపాధ్యక్షులు గిరి, ప్రధాన కార్యదర్శులు కోన మల్లేష్, రేతి వెంకటేష్, గొరిగి శ్రీనివాస్, సుందర్ తదితరులు పాల్గొన్నారు.