04-08-2024 12:13:13 AM
యాదాద్రి, భువనగిరి, ఆగస్టు3 (విజయక్రాంతి) : ప్రసిద్ధ్ద పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో శనివారం స్వామివారికి నిత్యపూజలు ఘనంగా జరిగాయి. ప్రధానాలయంలో స్వామివారికి అభిషేకం, అర్చన నిర్వహించారు. యాగశాలలో నిత్యహోమం జరిపి, ఆగమశాస్త్రాను సారం నిత్యకల్యాణం నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తులను తిరువీధుల్లో ఊరేగించారు. తదనంతరం స్వామివారి సన్నిధిలో భక్తి సంగీత కార్యక్రమం అలరించింది.