17 April, 2026 | 4:39 AM

వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని పంచాయతీలో ప్రత్యేక శానిటేషన్ పనులు తప్పనిసరి

23-06-2025 10:32 PM

పినపాక ఎంపీఓ వెంకటేశ్వరరావు..

పినపాక (విజయక్రాంతి): సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ ప్రజల భాగస్వామ్యంతో పారిశుధ్యం, దోమల నివారణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని గ్రామ పంచాయతీలలో అమలు చేయాలని పినపాక ఎంపీఓ వెంకటేశ్వరరావు(MPO Venkateswara Rao) సెక్రటరీలను ఆదేశించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ... సెక్రటరీలు ముఖ్యంగా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గ్రామాల్లో ఆదివాసీ ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలడానికి ముందే వాటిని అరికట్టే విధంగా అవగాహన కల్పించి ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు.

గ్రామ పంచాయతీలలో హ్యాబిటేషన్లలో ప్రతిరోజు నిర్వహించే శానిటేషన్‌తో పాటు ఈ వర్షాకాల సీజన్‌లో స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌ నిర్వహించాలన్నారు. ఓవర్‌ హెడ్‌ రిజర్వాయర్లలో నిర్దేశించిన షెడ్యూర్‌ ప్రకారం క్లీనింగ్‌ అనంతరం జియో టాగింగ్‌, ఫొటోను నిర్దేశించిన ఫార్మాట్‌లో పొందుపరచాలన్నారు. ఎక్కడైనా ఓహెచ్‌ఎఆర్‌ శుభ్రం చేయలేదని ఆరోపణ వస్తే సంబంధిత గ్రామ పంచాయతీ సెక్రటరీపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో మురికి కాలువలు శుభ్రం చేయడం, చెత్తను తొలగించడం, రహదారులపై గుంతలు పూడ్చడం తదితర పనులు చేపడుతున్నామని తెలిపారు.