9 May, 2026 | 5:36 PM

Breaking News

వెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు   •   అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు   •   పాత బిల్లుల పేరిట కొత్త పాలకవర్గంపై ఒత్తిడి?   •   కాకతీయ కళల జాతర సాంస్కృతిక పోటీలు ప్రారంభం   •   పేదల మెరుగైన జీవితం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమే   •   కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులను కలిసిన ఎర్ర విజయ్ రావు   •   సుల్తానాబాద్ లో జాతీయ పక్షి నెమలి మృతి   •   ధాన్యం కొనాలని ఇందారంలో రైతుల రాస్తారోకో   •   సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •  

గోదావరి పరీవాహక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా

09-09-2025 12:37 AM

మంథని, సెప్టెంబర్ 8(విజయ క్రాంతి) గోదావరి పరివాహక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచామని రామగుండం పోలీస్ క మిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. సో మవారం మంథని పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ స్టేషన్ పరిసరాలను పరిశీలిమచడంతో పాటు, స్టేషన్ భౌగోళిక పరిస్థితులు, సిబ్బంది పనీతీరు, స్టేషన్ పరిధిలో అధికంగా నమోదయ్యే కేసుల వివరా లతో పాటు, గ్రామాల వివరాలను మంథని సీఐ రాజు ను అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్ సిబ్బందితో మాట్లాడి రికార్డ్ లను పరి శీలించి, పోలీస్ స్టేషన్ పెండింగ్ కేసులపై సీపీ ఆరా తీయడంతో పాటు నేరాల నియంత్రణ కు తీసుకుంటున్న చర్యలను సీఐ రాజు, ఎస్‌ఐ రమేష్ ని అడిగి తెలుసుకొన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలను సందర్శించాలని, గట్టి నిఘా ఉంచాలని అధికా రులకు సీపీ సూచించారు.