09-09-2025 12:36:29 AM
సీఎంను కలిసిన వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్, సెప్టెంబరు 8 (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీకి కరీంనగర్ జిల్లా కం చుకోట అనీ, రాబోయే మున్సిపల్ ఎన్నిక ల్లో కరీంనగర్ కార్పొరేషన్ తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచిం చారు. సోమవారం హైదరాబాద్ జూబ్లీహి ల్స్ లోని ముఖ్యమంత్రి స్వగృహంలో ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వె లిచాల రాజేందర్ రావు మర్యాదపూర్వకం గా కలిశారు.
ఈ సందర్భంగా పలు అంశాలపై ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా చర్చించా రు. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీని మరింత బ లోపేతం చేయాలని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్కు కంచుకోట అని ముఖ్యమం త్రి తెలిపారు. కరీంనగర్ ప్రజలు పార్టీ క్యా డర్ తో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు మ మేకమవుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నానని రాజేందర్ రావు సీఎంకువివరించారు.