09-09-2025 12:40:13 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం భుజానికి ఎత్తు కున్న మల్లన్నసాగర్-, మూసీ పునరుజ్జీవం వెనుక భారీ కుంభకోణం ఉందని, పునరుజ్జీవం పేరుతో విడతలవారీగా దోపిడీ జరు గుతున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
కొండపోచ మ్మ సాగర్ నుంచి గోదావరి జలాలను హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు బీఆర్‌ఎస్ హయాంలో కేవలం రూ.1,100 కోట్లతో అంచనాలు రూపొందించామని, ఇప్పుడా అంచనాలను కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 7,390 కోట్లకు ఎందుకు పెంచిందని ప్రశ్నించారు. అంచనాలను 7 రెట్లు పెంచి సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని దుయ్యబట్టారు. రూ.16 వేల కోట్లతో పూర్త య్యే మూసీ సుందరీకరణ ప్రాజెక్టును రూ. 1.50 లక్షల కోట్లకు పెంచడం వెనుక మతలబు ఎంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మల్లన్నసాగర్ నుంచి మూసీకి గోదావరి జలాలను తీసుకువచ్చే పథకానికి సీఎం శంకుస్థాపన చేసి ఎప్పటికైనా తెలంగాణ కల్పతరువు, కామధేనువు కాళేశ్వరం ప్రాజెక్టే అనే వాస్తవాన్ని తెలియజెప్పారని అభిప్రాయపడ్డారు. మల్లన్నసాగర్‌కు గోదావరి జలాలు ఎక్కడి నుంచే వస్తాయో చెప్పే ధైర్యం సీఎంకు ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర వరదాయి ని అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను విఫల ప్రాజెక్టుగా ప్రచారం చేసినందుకు సీఎం రేవం త్‌తో సహా కాంగ్రెస్ నేతలంతా రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశా రు.
కాళేశ్వరంపై చెప్పిన అబద్ధాలను కప్పి పుచ్చుకునేందుకే మల్లన్న సాగర్ దగ్గర కాకుండా, గండిపేట వద్ద సీఎం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని వ్యాఖ్యానించారు. రూ. లక్ష కోట్ల అవినీతి, కాళేశ్వరం కూలేశ్వరం అన్న ఆరోపణలు చేసిన సీఎం రేవంత్, తన కు ముఖం చెల్లకనే అలా చేశారని చెప్పారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు పరిధిలో ఉమ్మ డి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి స్టోరేజ్ కెపాసిటీ ఏర్పాటు చేయలేదని గుర్తుచేశారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం కాళే శ్వరం ప్రాజెక్టు కోసం 141 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 15 రిజర్వాయర్లు నిర్మించామని స్పష్టం చేశారు. 2006లో అంచనాలు రూపొందించిన ప్రాణహిత- చేవెళ్ల పథకానికి, 2015లో అంచనాలు రూపొందించిన కాళేశ్వరానికి మధ్య వ్యత్యాసం ఉంటుందని అభిప్రాయపడ్డారు. మొన్నటి వర్షాలకు మేడిగడ్డ బరాజ్ 12 లక్షల క్యూసెక్కుల వరద నీటిని తట్టుకుని చెక్కు చెదరకుండా ఉందని గుర్తుచేశారు.
మేడిగడ్డ బరాజ్‌కు ఎందుకు మరమ్మతులు చేయించడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. మేడిగడ్డ బరాజ్‌ను రూ.4 వేల కోట్లతో నిర్మించామని, మూడు పిల్లర్ల మరమ్మతులకు కేవలం రూ.250 కోట్లు అవుతుందని వెల్లడించారు. మూడు పిల్లర్ల మరమ్మతులు తమ సొంత డబ్బుతో చేస్తామని ఎల్‌అండ్‌టీ ముందుకు వచ్చిందని గుర్తుచేశారు. ఒక సంస్థే ముందుకు వచ్చి పిల్లర్లు నిర్మిస్తామని చెప్తుంటే, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం మరమ్మతులకు ప్రజాధనం వృథా అవుతుందని ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఏపీ ప్రభుత్వం అక్కడ నిర్మించే బనకచర్ల ప్రాజెక్ట్‌కు సహకరించేందుకే సీఎం రేవంత్‌రెడ్డి మేడిగడ్డను బొందపెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీని బీజేపీ జేబు సంస్థలని కాంగ్రె స్ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శిస్తుంటే, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం కాళేశ్వరం ప్రాజె క్టు విచారణను సీబీఐకి అప్పగించడం విడ్డూరంగా ఉందన్నారు. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదన్నట్టుగా రాష్ట్రప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ ద్వారా ఏమీ సాధించలేకపోయిందని ఎద్దేవా చేశారు.
కాళేశ్వరమంటే ఒక్క బరాజ్ కాదని, ప్రాజెక్టు పరిధిలో మూ డు బరాజ్‌లు, 15 రిజర్వాయర్లు ,19 సబ్ స్టేషన్లు, 21 పంపింగ్ స్టేషన్లు, 203 కిలోమీటర్ల సొరంగ మార్గం, 1,531 కిలోమీటర్ల మేర కాలువలు, 98 కిలోమీటర్ల మేర ప్రెజ ర్ మెయిన్ ఉంటుందని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. కొండపోచమ్మ సాగర్ నుంచి హైదరాబాద్‌కు గురుత్వాకర్షణ ద్వారానే జలాలు తీసుకురావొచ్చని, అయినప్పటికీ ప్రభుత్వం ఆ పనిచేయడం లేదని విమర్శించారు.
ప్రాజెక్టు పేరు చెప్పి మూడు నీటి శుద్ధికేంద్రాలు, ఐదు పంప్ హౌస్‌లు నిర్మిస్తుందన్నారు. కేవలం కమీషన్లు దండుకునేందుకు, కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే ప్రభుత్వం ఆ పనులు చేపడుతున్నదని ఆరోపించారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిన ఘటనకు కారణమైన కాంట్రాక్ట్ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయాలని హెచ్‌ఎండబ్ల్యూఎస్ ఎస్‌బీ గతంలో రిపోర్ట్ ఇచ్చిందని గుర్తుచేశారు. అదే సంస్థ మరోచోట మరో ప్రమా దానికి కారణమైందని పేర్కొన్నారు.
అలాంటి సంస్థకు రూ.7 వేల కోట్ల విలువైన పను లు అప్పగించడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన కాంట్రాక్ట్ కంపెనీని రాష్ట్రప్రభుత్వం మాత్రం ఎందుకు బ్లాక్ లిస్టులో చేర్చడం లేదని నిలదీశారు. మేడ్చల్‌లో 12 వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత కేసుపై పోలీసులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, సంతోష్‌రావుపై ఇటీవల తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ఆరోపణలపై కేటీఆర్ స్పందిస్తూ.. కవిత విషయమై పార్టీలో అంతర్గతంగా ఆలోచించే సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నామని తేల్చిచెప్పారు.