పేపర్ లీక్‌ల దర్యాప్తునకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్
25-07-2026 02:00 AM
- ఢిల్లీ పోలీసుల ప్రకటన
- అన్ని పరీక్షల నేరాలపై దర్యాప్తు
న్యూఢిల్లీ, జూలై 24: పరీక్షలకు సంబంధించిన పేపర్ లీక్, ఇదే అంశానికి సంబం ధించిన ఇతర తీవ్ర నేరాలను దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ పోలీసులు క్రైమ్ బ్రాంచ్‌లో ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్)ను ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ ఆమోదం తెలిపినట్లు శుక్రవారం ప్రకటనను విడుదల చేశారు.
ఇటువంటి నేరాలపై సత్వర, సమగ్ర దర్యాప్తు జరిగేలా, నిందితులకు త్వరగా శిక్షలు పడేలా చర్యలు తీసుకోనుంది. యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్, ఎన్టీఎ పరీక్షల నేరాలపై దర్యాప్తు చేపట్ట నుంది. ఈ బృందానికి క్రైమ్‌బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ నేతృత్వం వహించనుండగా, పర్యవేక్షణ, పరిపాలనా నియంత్రణ బాధ్యతలను స్పెషల్ కమిషనర్ నిర్వహించనున్నారు.






