25 July, 2026 | 3:07 AM

షార్ట్ సర్క్యూట్‌తో గుడిసె దగ్ధం

25-07-2026 02:29 AM

మల్దకల్, జూలై 24: మల్దకల్ మండలంలోని దాసరిపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూజారి రంగన్న కుమారుడు పూజారి రంగస్వామికి చెందిన గుడిసె శుక్రవారం అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న బట్టలు, గృహోపకరణాలు, వంట సామగ్రి, ధాన్యం, నగదు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు తక్షణమే ఆదుకుని ఆర్థిక సాయం అందించాలని గ్రామస్తులు కోరారు.