25 July, 2026 | 3:07 AM

స్టెమ్‌స్పార్క్ కాలేజీలో ఫ్రెషర్స్ డే

25-07-2026 02:27 AM

హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): ఖమ్మం శ్రీనగర్ కాలనీలోని సూర్య రిసార్టులో శుక్రవారం స్టెమ్‌స్పార్క్ జూనియర్ కాలేజ్ ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. గౌహతి ఐఐటీ ప్రొఫెసర్లు డా.రాజ్ కుమార్, డా.శిరీష ముఖ్య అతిథులుగా హాజరై, కాలే జ్ డైరెక్టర్లు కొండా శ్రీధర్‌రావు, కొండా కృష్ణవేణితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా డా. రాజ్‌కుమార్, డా. శిరీష మాట్లా డుతూ.. విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ క్రమశిక్షణ, నిరంతర సా ధన, గ్రూప్ స్టడీస్, సమయపాలనతో జేఈ ఈ మెయిన్స్, అడ్వాన్స్లో విజయాలు సా ధించి ఐఐటీ సీటే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. కాలేజ్ డైరెక్టర్ కొండా శ్రీధర్‌రావు మాట్లాడుతూ స్టెమ్‌స్పార్క్ జూ నియర్ కాలేజ్ తొలి ఏడాదిలోనే విద్యార్థు లు ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీలతో పాటు ఈఏపీసెట్లోనూ ఉత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు.  ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.