01-07-2025 02:39:29 AM
వారసిగూడ జూన్ 30 (విజయక్రాంతి) : బీజేపీ తెలంగాణ రాష్ట్ర నూతన బీజేపీ అధ్యక్షుడిగా శాసన ము మండలి మాజీ సభ్యులు రామచంద్ర రావు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవి ప్రసాద్ గౌడ్ మర్యాదపూర్వకంగా సోమవారం తార్నాక లోని వారి నివాసంలో శాల్వాతో సత్కరించి బీజేపీని రాష్ట్రంలో అధికార దిశలో పయనింపజేసి ముం దుండాలని వారిని కోరారు.
వారిని కలిసిన వారిలో సికింద్రాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకుడు నాగేశ్వర్ రెడ్డి, హరి వెంకటేశ్ గౌడ్, పోచయ్య యాదవ్, నేతి సత్యనారాయణ, ఉపేందర్ దత్తు, మహేష్, శ్రీనివాస్, మోహన్, శశి, రామ వర్మ, అంబాల రాజేశ్వర్, గణేష్ ముదిరాజ్, శ్రీనివాస్ చారి, బిక్షపతి యాదవ్, శివాజీ, సుబ్బారావు పాల్గొన్నారు.