calender_icon.png 1 July, 2025 | 8:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ సంస్కరణలతోనే దేశాభివృద్ధి

01-07-2025 02:38:40 AM

  1. దేశానికి, రాష్ట్రానికి  ఆర్థిక నిపుణుల సేవలు  కీలకం 
  2. రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి 

హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తీసుకొచ్చిన భూ సంస్కరణలు దేశం ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చెందడానికి దోహదపడ్డాయని రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంలోనే ఎక్కువగా వరి సాగయ్యేదని, ఇప్పుడు తెలంగాణలోనూ వరి సాగు పెరిగిందన్నారు.

అందుకు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న రైతు సంక్షేమ పథకాలే కారణమని అన్నారు. గచ్చిబౌలిలోని రామానుజన్ భవనం ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన  నేషనల్ స్టాటిస్టిక్స్ డే వేడుకలకు కోదండ రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రపపంచలోనే భారత్ అతిపెద్దదేశంగా నిలబడటానికి సీఆర్ రావు ఎంతగానో కృషి చేశారని తెలిపారు.

గణాంక శాస్త్రవేత్తగా సీఆర్‌రావు మాజీ ప్రధాని నెహ్రుకు సలహాలిచ్చి ప్రణాళిక బద్ధంగా దేశాన్ని ముందుకు తీసుకుపోవడానికి కృషి చేశారని కొనియాడారు. ఆర్థిక నిపుణుల సలహాలు, సూ చనలతోనే దేశం, రాష్ట్రం ఆర్థికంగా ముందుకెళ్తున్నాయని, ఆహార భద్రత, ఆర్థిక లోటు లేకుండా దేశం అభివృద్ధి దిశలో పరుగులు పెట్టాలంటే ఆర్థిక నిపుణుల సేవలు కీలకం అని పేర్కొన్నారు.