01-07-2025 02:41:01 AM
కొనసాగుతున్న పిటిషనర్ల వాదనలు
హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): తెలంగాణ హైకోర్టులో టీజీపీఎస్సీ గ్రూప్ 1 కేసు విచారణ మంగళవారానికి వాయిదా పడింది. వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం పిటిషనర్ తరఫు వాదనలు కొనసాగాయి.
గతంలో పిటిషనర్లు ఎత్తిచూపిన లోపాలకు టీజీపీఎస్సీ తరఫున ఇచ్చిన కౌంటర్‌కు బదులిస్తూ పిటిషనర్ల తరఫు వాదనలు వినిపించారు. మెయిన్స్ పరీక్ష నిర్వహణలో అవకతవకలు, మూల్యంకనం, ఫలితాల విడుదలలో లోపాలను వివరించారు. వాదనలు మంగళవారం సైతం కొనసాగనున్నాయి.