ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉంటా
కౌన్సిలర్ అబ్దుల్హ బిన్ అహేమద్
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఎల్లవేళల ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని 15వ వార్డ్ కౌన్సిలర్ అబ్దుల్హ బిన్ అహేమద్ అన్నారు. ఆదివారం 15వ వార్డ్‌లో విశ్రాంత ఎంపిడిఓ రేగుళ్ల కృష్ణమూర్తి నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో కౌన్సిలర్ అబ్దుల్హ బిన్ అహేమద్‌ను పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తనపై విశ్వాసం ఉంచి భారీ మెజార్టీతో గెలిపించిన 15వ వార్డ్ కాలనీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాలనీలో నిర్మాణంలో ఉన్న రెండు మినీ కాల్వర్ట్లు పూర్తి కాలేదని, వాటి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రత్యేకంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్‌జిఓ కాలనీ వాసులు, విశ్రాంత ఎంఆర్వో వనం రాజన్ బాబు, రిటైర్డ్ ఎంపీడీవో కృష్ణమూర్తి, కొండ్ర రాజేశ్వర్, మిలింద్ కుమార్, శ్రీనివాస్, రాజ్‌కుమార్, హరీష్ రాజు తదితరులు పాల్గొన్నారు.




