15 June, 2026 | 1:55 AM

క్రీడలు మానసికంగా, ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో దోహదపడతాయి

15-06-2026 12:32 AM

కరాటే మల్లికార్జున్ గౌడ్ 

ఉప్పల్ జూన్ 14విజయక్రాంతి : క్రీడలు మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో దోహదపడతాయని  విక్టోరియా షోటో కాన్ వ్యవస్థాపకుడు రంగు మల్లికార్జున్ కూడా అన్నారు. విక్టోరియా  కరాటే అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో  మల్లాపూర్ లోని స్వాగత్ గ్రాండ్ లో 25 వార్షికోత్సవం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాలుగు రాష్ట్రాల చెందిన అసోసియేషన్ ఫౌండర్స్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మ రక్షణకు కరాటే ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న  క్యాలెండర్ ఆవిష్కరణ సంబంధించిన విషయాలను చర్చించినట్లు ఆయన  తెలిపారు.

ప్రతి సంవత్సరం నిర్వహించే అసోసియేషన్ మీటింగ్ ల కు సభ్యులు అందరూ హాజరు కావడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. స్కూల్  లో యూనివర్సిటీ లో ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈ సంవత్సరం మన సంస్థకు చెందిన క్రీడాకారులు ముందంజలో ఉండాలని క్రీడాకారులు రాష్ట్రంలో కాకుండా జాతీయస్థాయిలో కూడా మెడల్ సాధించాలని ఆయన సూచించారు. జాతీయస్థాయి టోర్నమెంట్ లకు సంస్థకు  చెందిన సభ్యులు పూర్తి సహకారం అందించి ముందంజలో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని మల్లికార్జున్ గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కరాటే మాస్టర్లు బాబురావు శ్రీనివాస్ సురేష్ ప్రసాద్ గౌడ్ శంకర్ హరిబాబు జగదీష్ సాయి కుమార్ గౌతమ్ కర్ణాటక చెందిన రామకృష్ణ గౌడ్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు