బాలాపూర్ క్రాస్ రోడ్డులో ఫ్లైఓవర్ నిర్మాణానికి కృషి
ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
బడంగ్పేట్, జూన్ 14 (విజయక్రాంతి): బాలాపూర్ క్రాస్ రోడ్డులో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రత్యేకంగా కృషి చేస్తానని మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. మీర్పేట్ 60వ డివిజన్ శ్రీరస్తు కన్వెన్షన్ హాల్లో సాయి సామ్రాట్ నగర్ కాలనీ అసోసియేషన్, మాజీ కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ అభినందన సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు ఆమెను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయడం, మౌలిక సదుపాయాలు కల్పించడం తన బాధ్యత అన్నారు. మాజీ కార్పొరేటర్ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కాలనీలో ఎన్నో ఏళ్లుగా ఉన్న దీర్ఘకాలిక భూగర్భ డ్రైనేజీ సమస్యను రూ. 25 లక్షల నిధులతో శాశ్వతంగా పరిష్కరించినందుకు ఎమ్మెల్యే సబితమ్మకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, కాలనీ అధ్యక్షుడు దారాల మధు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.






