14 July, 2026 | 4:59 PM

Breaking News

అబాకస్ పోటీల్లో రాష్ట్ర స్థాయి విజేతలుగా బ్లూ బెల్స్ విద్యార్థులు   •   రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కేరళ మోడల్ హై స్కూల్ విద్యార్థులు   •   20లోగా ఓటర్ల సవరణ పూర్తి చేయాలి: కలెక్టర్ రాహుల్ శర్మ   •   ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •  

మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయి

01-12-2024 07:06 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే..

ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా 2 కే రన్ 

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహదారుడ్యానికి దోహద పడతాయని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఉన్నారు. ప్రజా పాల విజయోత్సవాలలో భాగంగా ఆదివారం 2 కే రన్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న నేపథ్యంలో ఈ నెల 9 వరకు ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల వేడుకలను ప్రభుత్వం పండగ వాతావరణంలో ఘనంగా నిర్వహిస్తుందన్నారు. 2కే రన్ లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులను, యువతను అభినందించారు. విద్యార్థులు, యువత చదువుతోపాటు, ప్రతి రోజూ కొంత సమయాన్ని క్రీడలకు కేటాయించాలని సూచించారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదన్నారు. క్రీడాకారులు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీ.వై.ఎస్.ఓ. రమాదేవి, పీ.డీలు, పీ.ఈ.టీ.లు, వాలీ బాల్ అకాడమీ క్రీడాకారులు, యువతీ యువకులు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, మహిళా సంఘాలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.