21 March, 2026 | 3:39 AM

పిచికారీ చేసే డ్రోన్ బ్యాటరీ పేలి రైతుకు తీరని నష్టం

21-03-2026 12:37 AM

గుండాల, మార్చి 20 (విజయక్రాంతి): మండల పరిధిలోని కొమ్ముగూడెం గ్రామానికి చెందిన రైతు వాగబోయిన నరసింహారావు ఇంట్లో శుక్రవారం డ్రోన్ బ్యాటరీ పేలడంతో ఆ గ్రామ ప్రజలు భయాందోళనకు గురైనారు. నరసింహారావు ఎస్‌ఏజీ అనే కంపెనీ డ్రోన్ ను ముగ్గురు రైతులతో పాటు అప్పు చేసి సుమారు రూ. 4,00000 వ్యయం చేసి కొనుగోలు చేయడం జరిగిందని, డ్రోన్ మరమ్మత్తు ఉండటం వల్ల డ్రోన్ నుంచి బ్యాటరీ వేరు చేసి శుక్రవారం ఉదయం వరంగల్ తీసుకుని వెళ్దామని అనుకున్న క్రమంలో ఉదయం 8:30 గంటల సమయంలో డ్రోన్ నుంచి అకస్మాత్తుగా మంటలు వచ్చి, పెద్ద శబ్దంతో పేలడంతో భయబ్రాంతులకు లోనైయ్యామని వారు తెలిపారు.

దాని పక్కనే ఉన్న డ్రోన్ ఛార్జర్ కు కూడా మంటలు అంటుకొని ఛార్జర్ కూడా పూర్తిగా కాలిపోయిందని, ఇంటి దర్వాజకు కూడా నిప్పు అంటుకుందని, ఉదయం వేళ కావడంతో ఎవరూ కూడా పనులకు వెళ్ళకపోవడంతో వెంటనే ఇంటికి అంటుకున్న  మంటలను ఆర్పడం జరిగిందని వారు తెలిపారు. ఈ ప్రమాదం వలన తమకు సుమారు రూ. 110000 నష్టం వాటిల్లందని, ప్రభుత్వం నష్ట పరిహారం అందించి తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.