పిచ్చుకలకు గూళ్లు ఏర్పాటు
నిర్మల్, మార్చి 20 (విజయక్రాంతి): అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం వివిధ ప్రాంతాల్లో గూళ్లను ఏర్పాటు చేశారు. ఆయా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పిచ్చుకల నివాసాలపై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా మహమ్మద్ నజీర్ ఖాన్, ఉప అటవీ క్షేత్రాధికారి, సారంగాపూర్ పాల్గొని పిచ్చుకల యొక్క ప్రాముఖ్యత,
వాటి అంతరించుట గల కారణాలు, పర్యావరణ పరిరక్షణలో వాటి యొక్క పాత్ర గురించి విద్యార్థులకు అవగాహన కలిగిస్తూ, పాఠశాల పరిసరాలలో వ్యర్థంగా పడి ఉన్నటువంటి ప్లాస్టిక్ డబ్బాలతో పిచ్చుకల కోసం ఆహారం మరియు నీటి వసతులను కల్పించే విధంగా తొట్టిలను విద్యార్థులతో చేయించి పాఠశాల ఆవరణలో గల చెట్లకు కట్టించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జనార్ధన్, ఉపాధ్యాయులు, వెన్నెల, సుజాత ఎఫ్‌బిఓలు, విద్యార్థులు పాల్గొన్నారు.




