తమిళనాడులో విషాదం.. కల్తీ సారా తాగి ఐదుగురు మృతి
19-06-2024 04:36 PM
చెన్నై: తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. కల్లకురిచిలో బుధవారం జరిగిన దారుణ ఘటనలో కల్తీ మద్యం సేవించి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కల్తీ మద్యం సేవించిన పది మందికి పైగా వ్యక్తులను కల్లకురిచిలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కల్తీ మద్యం ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు. కల్తీ మద్యం పంపిణీకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు ప్రభుత్వాన్ని కోరారు. మృతదేహలతో సారా కేంద్రం దగ్గర గ్రామస్థుల ఆందోళనకు దిగారు. ఈ సంఘటనపై తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.






