10 August, 2026 | 11:50 AM

ఉద్యోగాల పేరుతో భారీ మోసం

19-06-2024 04:22 PM

హైదరాబాద్ : నిరుద్యోగులను ఉద్యోగాల పేరుతో రైల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీ మోసం చేసింది.  3 నెలల క్రితం గచ్చిబౌలిలో బ్రాంచ్ ప్రారంభించిన కంపెనీ దేశంలో 5 ప్రధాన నగరాల్లో బ్రాంచీలు ఉన్నాయని చెప్పి నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. ఉద్యోగుల నుంచి సెక్యూరిటీ డిపాజిట్లు సేకరించిన రైల్ వరల్డ్ కంపెనీ ఒక్కోక్కరి నుంచి రూ.50 వేలు వసూలు చేసింది. ఇప్పుడు కంపెనీ మూసివేశామని ఉద్యోగులకు యాజమాన్యం తెలియజేసింది. సెక్యూరిటీ డిపాజిట్లు తీసుకుని మోసం చేశారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైల్ వరల్డ్ కంపెనీపై రాయదుర్గం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.