రష్యాకు ఉత్తర కొరియా మద్దతు
ఉత్తర కొరియా: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియాలో పర్యటించారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆహ్వానం మేరకు ఆ దేశానికి వెళ్లిన పుతిన్ ను కిమ్ స్వయంగా ప్యాంగ్యాంగ్ ఎయిర్ పోర్టుకు వెళ్లి స్వాగతం పలికారు. అనంతరం ప్యాంగ్యాంగ్ లో నిర్వహించిన కార్యక్రమంలో పుతిన్, కిమ్ పాల్గొన్నారు. ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యాకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మద్దతు ప్రకటించారు.
24 ఏళ్ల తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియాకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు సహకరించుకునేలా కిమ్ ఒప్పందం చేసుకున్నారు. రష్యాకు ఆపద వస్తే ఉత్తర కొరియా, కిమ్ కు ఆపద వస్తే రష్యా ఆదుకునేలా ఈ డిల్ జరిగింది. అంతేకాదు ఇరు దేశాధినేతలు గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకున్నారు. కిమ్ కు రష్యాకు చెందిన ఔరస్ లగ్జరీ కారును పుతిన్ గిఫ్ట్ గా ఇచ్చారు.






