31 March, 2026 | 2:40 PM

Breaking News

బీజేపీలో చేరిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్   •   ట్యాంక్‌బండ్‌పై 4 కోట్లతో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు   •   వెలుగులోకి కల్తీ అల్లం పేస్ట్ వ్యవహారం... హైదరాబాద్‌లో వ్యాపారి అరెస్టు   •   చైత్ర మాసం చివరి రోజున ఆలయంలో తొక్కిసలాట: 8 మంది మృతి   •   గురుకుల విద్యను సద్వినియోగం చేసుకోవాలి   •   ఈదురు గాలులకు నేలకొరిగిన వరి, జొన్న పంట   •   మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం — రైతుల నుంచి విశేష స్పందన   •   హైదరాబాద్‌లో జయలలిత ఇంటికి సీల్   •   ఆకాల వర్షాలకు పంటలు ఆగం.. తీవ్ర ఆందోళ‌న‌లో నిజామాబాద్ రైతులు   •   బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు   •  

ఎస్ఆర్ విద్యార్థినికి నీట్‌లో 100వ ర్యాంక్

17-06-2025 05:05 PM

డీఐఈఓ దస్రు నాయక్ అభినంద‌న‌..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): శనివారం విడుద‌లైన నీట్ ఫలితాల్లో న‌ల్ల‌గొండ ప‌ట్ట‌ణం చ‌ర్ల‌ప‌ల్లిలోని ఎస్ఆర్ క‌ళాశాల(SR College) విద్యార్థిని బచ్చు ప్రియాంక ఆలిండియా స్థాయిలో 100వ ర్యాంకు సాధించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం డీఐఈఓ ద‌స్రూనాయ‌క్(DIEO Dasrunayak) ఎస్ఆర్ క‌ళాశాల‌కు విచ్చేసి జోన‌ల్ ఇన్‌చార్జి దోనాల శ్రీ‌నివాస్‌రెడ్డితో క‌లిసి విద్యార్థిని ప్రియాంక‌ను స‌న్మానించారు. అదేవిధంగా ఆమె త‌ల్లిదండ్రుల‌ను అభినందించారు.

ప్రియాంకతో పాటు నల్గొండ బ్రాంచ్ లో మెడిసిన్ ర్యాంక్ సాధించిన పావని, లేఖన, ప్రవల్లిక, జ్యోతి, గాయత్రి, దివ్య ధరణిలను వల్ల తల్లిదండ్రులను శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంత‌రం డీఐఈఓ మాట్లాడుతూ క‌ష్ట‌ప‌డి చ‌దివి భ‌విష్య‌త్‌లో ఉన్న‌త స్థానాల‌కు ఎదుగాల‌ని ఆకాంక్షించారు. ఎస్ఆర్ విద్యాసంస్థ‌ల చైర్మ‌న్ ఏన‌గందుల వ‌ర‌దారెడ్డి, డైరెక్ట‌ర్ సంతోశ్‌రెడ్డి, సీఈఓ సురేంద‌ర్‌రెడ్డి, న‌ల్ల‌గొండ బ్రాంచ్ అసిస్టెంట్ జోన‌ల్ స‌తీశ్‌రెడ్డి, ప్రిన్సిపాళ్లు మనోజ్ రెడ్డి, డీన్ కిషోర్ బాబు, ఏఓ సరితారెడ్డి, అధ్యాప‌కులు వర్ధన్, ప్రసన్న, శ్రీనివాస్, శోభ విద్యార్థుల‌ను.. అభినందించారు.