10 May, 2026 | 6:59 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

ఎస్‌ఆర్ విద్యార్థినికి నీట్‌లో100 వ ర్యాంక్

18-06-2025 12:00 AM

డీఐఈఓ దస్రు నాయక్ అభినందన

నల్లగొండ టౌన్, జూన్ 17 : శనివారం విడుదలైన నీట్ ఫలితాల్లో నల్లగొండ పట్టణం చర్లపల్లిలోని ఎస్ ఆర్ కళాశాల విద్యార్థిని బచ్చు ప్రియాంక ఆలిండియా స్థాయిలో 100వ ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం డీఐఈఓ దస్రూనాయక్ ఎస్ ఆర్ కళాశాలకు విచ్చేసి జోనల్ ఇన్చార్జి దోనాల శ్రీనివాస్రెడ్డితో కలిసి విద్యార్థిని ప్రియాంకను సన్మానించారు. అదే విధంగా ఆమె తల్లిదండ్రులను అభినందించారు.

ప్రియాంక తోపాటు నల్గొండ బ్రాంచ్ లో మెడిసిన్ ర్యాంక్ సాధించిన s. పావని, లేఖన, ప్రవల్లిక,జ్యోతి,గాయత్రి,దివ్య ధరణి లను వల్ల తల్లి దండ్రులను శాలువతో సత్కరించి అభినందనలు  తెలిపారు. అనంతరం డీఐఈఓ మాట్లాడుతూ కష్టపడి చదివి భవిష్యత్లో ఉన్నత స్థానాలకు ఎదుగాలని ఆకాంక్షించారు.

ఎస్‌ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఏనగందుల వరదారెడ్డి, డైరెక్టర్ సంతోశ్రెడ్డి, సీఈఓ సురేందర్రెడ్డి, నల్లగొండ బ్రాంచ్ అసిస్టెంట్ జోనల్ సతీశ్రెడ్డి, ప్రిన్సిపాళ్లు మనోజ్ రెడ్డి , డీన్ కిషోర్ బాబు, ఏఓ సరితారెడ్డి , అధ్యాపకులు వర్ధన్, ప్రసన్న, శ్రీనివాస్,శోభ విద్యార్థులను అభినందించారు.