23 June, 2026 | 5:23 PM

Breaking News

రోడ్డు ప్రమాదంలో డాన్స్ మాస్టర్ మృతి   •   రెవిన్యూ రికార్డులను పరిశీలించిన కలెక్టర్   •   బిగ్ డేటా యుగంలో ఈ-కామర్స్ భద్రతపై పరిశోధనకు పీహెచ్‌డీ   •   మాదిగల్లో అక్షరాస్యత పెంపుకు 40 రోజుల "గో టు విలేజ్" కార్యక్రమం   •   నెల్లిపాక భూములపై ప్రొహిబిషన్ ఎత్తివేయాలి   •   విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే బంగారు భవిష్యత్   •   ఐఎస్‌ సదన్‌లో భారీ చోరీ.. రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్   •   రైతులకు అందుబాటులో విత్తన మేళ   •   తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మట్టి పెల్లి సైదులు ఎన్నిక   •   ఎస్ఆర్ఆర్ లో బీకాం విద్యార్థులకు ఏఐ, డిజిటల్ లెర్నింగ్ పై శిక్షణ   •  

ధనుష్‌తో శ్రీలీల సినిమా షురూ

02-02-2026 12:00 AM

‘అమరన్’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన దర్శకుడు రాజ్కుమార్ పెరియాసామి తన తర్వాతి చిత్రాన్ని ధనుష్తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ధనుష్ కెరీర్లో 55వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో డైరెక్టర్ రాజ్కుమార్ పెరియాసామి.. సమాజంలో కలిసిపోయి ఉండే కొందరు అజ్ఞాత వీరుల కథను చూపించబోతున్నారని సమాచారం. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించనున్నట్లు వార్తలు వస్తుండగా, సాయి అభ్యాంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

‘అమరన్’ లాంటి ఎమోషనల్ హిట్ తర్వాత రాజ్కుమార్ తెరకెక్కిస్తున్న యాక్షన్ డ్రామా కావడంతో, ఈ కొత్త కాంబినేష్ప అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలావుండగా, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక క్రేజీ అప్డేట్ వెలువడింది. ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా ఎంపికయ్యారు.

ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వండర్బార్ ఫిలమ్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ధనుష్, శ్రీలీల టీమ్ సభ్యులతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పటికే శివకార్తికేయన్ సరసన ‘పరాశక్తి’ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల, ఇప్పుడు ఏకంగా ధనుష్ పక్కన నటించే ఛాన్స్ దక్కించుకోవడం విశేషం.